: బడ్జెట్ పై వ్యాపారవేత్తల స్పందన


ఎన్డీయే ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ పై భారతీయ వ్యాపారవేత్తల్లో భిన్న స్పందనలు వినిపించాయి. సిగరెట్లు తదితర పొగాకు ఉత్పత్తుల ధరలు పెంచడంపై ట్విట్టర్ వేదికగా అందరూ హర్షం వ్యక్తం చేశారు. సర్దార్ పటేల్ విగ్రహానికి 200 కోట్ల రూపాయలు కేటాయించడంపై మిశ్రమం స్పందన ఎదురైంది. ఎక్కువమంది దానిని దేశ అభివృద్ధికి కేటాయించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. నగరాల్లో మహిళల రక్షణకు కేవలం వంద కోట్లేనా? ఎన్డీయే మరింత సమర్థవంతంగా ఏదయినా చేస్తుందేమోనని భావించామని స్టెల్లా పాల్ అన్నారు. గుజరాత్ లో విజయవంతమైన అన్ని పథకాలకు కేంద్ర బడ్జెట్ లో స్థానం లభించిందని రవి ఘియర్ ట్వీట్ చేశారు. దేశ రక్షణ విషయంలో రాజీపడే ప్రశ్నేలేదని చాటుతూ రక్షణ రంగానికి 2.29 లక్షల కోట్ల రూపాయల కేటాయింపు అభినందనీయమని దేవేంద్ర ఫడ్నిస్ ట్వీట్ చేశారు. రైతుల కోసం కిసాన్ టీవీ పెడతామనడం అభినందనీయమని నీల్ సంఘ్వీ ట్విట్టర్లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News