: ఆ ప్రయాణికులు ఎంత అదృష్టవంతులో...!


విమాన ప్రమాదాలు ఎంత దారుణంగా ఉంటాయో తెలియందికాదు. ఆకాశానికి వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న వాయు విహంగం, ఒక్కసారిగా రెక్కలు తెగిన పక్షిలా నేలరాలితే.. అందులో ఉన్న ప్రయాణికుల్లో ఏ ఒక్కరు బతికినా అది అద్భుతమే అవుతుంది. ఆ విధంగా కుప్పకూలిన విమానంలో ఉన్నవారందరూ సజీవులైతే, అది నిజంగా మహాద్భుతమే. సరిగ్గా ఇలాంటి సంఘటనే నేడు ఇండోనేసియాలోని బాలి విమానాశ్రయం వద్ద చోటు చేసుకుంది.

బాలిలోని డెన్ సపార్ విమానాశ్రయంలో ల్యాండయ్యేందుకు లయన్ ఎయిర్ కు చెందిన బోయింగ్-747 విమానం ఒకటి సన్నద్ధమైంది. అయితే, రన్ వేపై దిగే క్రమంలో ఆ విమానం సమీపంలోని సముద్రంలో కూలిపోయింది. ప్రమాద సమయంలో ఆ విమానంలో 130 మందికి పైగా ఉన్నారు. ఆశ్చర్యకరంగా ఎవరి ప్రాణాలకు ముప్పు వాటిల్లలేదు. ఏడుగురు ప్రయాణికులకు మాత్రం గాయాలయ్యాయట. వారిని ఆసుపత్రికి తరలించారని తెలుస్తోంది. ఈ సంఘటనపై స్పందించిన ఇండోనేసియా ప్రభుత్వం తక్షణమే అధికారులను రంగంలోకి దించింది.

  • Loading...

More Telugu News