: దేశవ్యాప్తంగా ఐదు ఐఐఎంలు, ఐఐటీలు
ఈసారి దేశవ్యాప్తంగా ఐదు ఐఐఎంలు, ఐఐటీలను కొత్తగా ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఈ మేరకు జమ్ము, ఛత్తీస్ గఢ్, గోవా, ఆంధ్రప్రదేశ్, కేరళలో ఐదు ఐఐటీలు, హిమాచల్ ప్రదేశ్, బీహార్, ఒడిశా, పంజాబ్, మహారాష్ట్రలో ఐదు ఐఐఎంలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. వీటి కోసం రూ.500 కోట్లు కేటాయించామని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచస్థాయిలో ఉన్న పలు ఉన్నత శిక్షణ కోర్సులు దేశానికి అవసరమని పేర్కొన్నారు.