: రైతుల కోసం ‘కిసాన్’ టీవీ ఛానల్ వస్తోంది


వ్యవసాయానికి సంబంధించిన తాజా సమాచారాన్ని రైతులకు చేరవేసేందుకు ‘కిసాన్’ టీవీ ఛానల్ ను ప్రారంభించనున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభలో తెలిపారు. బడ్జెట్ లో ఇందుకోసం రూ.100 కోట్లను కేటాయించారు. ఈ ఛానల్ ద్వారా సేంద్రీయ ఎరువులు ఎలా వాడాలి? వాటి వల్ల ప్రయోజనాలు ఏమిటి? తదితర అంశాలను వివరించే కార్యక్రమాలు ప్రసారమవుతాయి. అలాగే కొత్త వ్యవసాయ పద్ధతులకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలను కూడా ఈ చానల్ ద్వారా ప్రసారం చేస్తారు. వ్యవసాయానికి సంబంధించిన తాజా అప్ డేట్స్ ను అన్నదాతలకు అందించనున్నారు.

  • Loading...

More Telugu News