: ఏపీ సంక్షేమ వసతి గృహాల్లో ఏసీబీ తనిఖీలు
ఆంధ్రప్రదేశ్ లోని సంక్షేమ వసతి గృహాల్లో ఏసీబీ అధికారులు ఈ ఉదయం ముమ్మర తనిఖీలు చేపట్టారు. ముందుగా నెల్లూరు జిల్లాలోని కలువాయి మండలం కల్లూరు, అనంతసాగరం మండలం రేవూరులోని ఎస్సీ, ఎస్టీ వసతి గృహాల్లో తనిఖీలు చేసి రికార్డులు పరిశీలించారు. అటు కడప జిల్లా బద్వేలులోని వసతి గృహాల్లో కూడా ఏసీబీ అధికారులు దాడి చేసి రికార్డులు పరిశీలిస్తున్నారు. వాటితో పాటు గుంటూరు, అనంతపురం, కడప, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లోని పలు వసతి గృహాల్లో వసతి, నిధుల వినియోగం, ఆహార పదార్థాల నాణ్యతను స్వయంగా పరిశీలిస్తున్నారు. ఈ మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ తనిఖీలు నిర్వహించనున్నారు.