: ఆర్డీఎస్ ఎత్తు పెంచి తీరుతాం: తెలంగాణ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రులకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఆర్డీఎస్ ఎత్తు పెంచి తీరుతామని టీ-ప్రభుత్వం స్పష్టం చేసింది. అవసరమైతే అదనపు బలగాలు మోహరించి అయినా ఆర్డీఎస్ ఎత్తును పెంచుతామని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు చెప్పారు. ఆర్డీఎస్ ఎత్తు పెంపుపై ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా 2005లోనే ఏపీ, కర్ణాటకల మధ్య ఒప్పందం కుదిరిందని ఆయన చెప్పారు.