: మురళీ విజయ్ అర్ధ సెంచరీ...భారత్ 120/3
ఇంగ్లాండ్ తో నాటింగ్ హామ్ లో జరుగుతున్న మొదటి టెస్టులో భారత్ తొలి రోజు లంచ్ విరామ సమయానికి మూడు వికెట్లు కోల్పోయి కేవలం 120 పరుగులు చేసింది. సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్ లేకుండా తొలిసారి ఇంగ్లాండ్ గడ్డపై ఆడుతున్న భారత జట్టు ఆరంభంలోనే శిఖర్ ధావన్ (12) వికెట్ కోల్పోయింది. మురళీ విజయ్ ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా అడ్డుకుని అర్ధ సెంచరీ సాధించాడు. 106 పరుగులకు లంచ్ కు వెళ్లిన భారత జట్టు లంచ్ తరువాత వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. పుజారా 38 పరుగులు చేసి నిష్క్రమించగా, కోహ్లీ కేవలం 1 పరుగు మాత్రమే చేసి బ్రాడ్ బౌలింగ్ లో అవుటయ్యాడు. దీంతో మురళీ విజయ్ (60) కు రహానే (8) జత కలిశాడు. దీంతో మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా కేవలం 120 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.