: బుల్లెట్ ట్రైన్ కాన్సెప్ట్ మంచిదే... కానీ భారత్ లో సాధ్యం కాదు: నితీశ్ కుమార్
ప్రధానమంత్రి నరేంద్రమోడీ హయాంలో తొలిసారి ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ లో కొత్త ప్రాతిపాదన బుల్లెట్ ట్రైన్స్. ఇందులో మొదటిది ముంబయి- అహ్మదాబాద్ వరకు తొలి ఫాస్టెస్ట్ బుల్లెట్ ట్రైన్, మిగతావి చెన్నై నుంచి హైదరాబాదు, విజయవాడ నుంచి హైదరాబాద్, నాగపూర్-సికింద్రాబాద్ సెమీ బుల్లెట్ ట్రైన్స్. వీటిపై స్పందించిన మాజీ రైల్వే మంత్రి, జేడీ(యు) నేత నితీశ్ కుమార్, బుల్లెట్ ట్రైన్స్ ప్రతిపాదన ఆకట్టుకునే విధంగానే ఉందన్నారు. కానీ, భారతదేశంలో ఇవి సాధ్యపడవని స్పష్టం చేశారు. తాను రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో లండన్ నుంచి ప్యారిస్ కు బుల్లెట్ ట్రైన్ లో ప్రయాణించానని... దాంతో, మన దేశంలో కూడా వాటిని తెచ్చేందుకు ప్రయత్నించానని చెప్పారు. అయితే, బుల్లెట్ ట్రైన్ కోసం ముందుగా ప్రత్యేకమైన ట్రాక్ కావాలని చెప్పారు. దానికోసం భారీగా స్థలం కూడా అవసరమవుతుందని పేర్కొన్నారు.