: క్రిమినల్ పరువునష్టం దావా కేసులో బీజేపీ ఉపాధ్యక్షుడికి బెయిల్
బీజేపీ ఉపాధ్యక్షుడు ముక్తార్ అబ్బాస్ నక్వీకు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జేడి(యు) మాజీ నేత సబీర్ అలీ దాఖలు చేసిన క్రిమినల్ పరువునష్టం దావా కేసులో ఈరోజు నక్వీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరయ్యారు. దాంతో, బెయిల్ ఇచ్చిన కోర్టు రూ.10వేల వ్యక్తిగత బాండు చెల్లించాలని ఆదేశించింది. ఇండియన్ ముజాహిదీన్ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ తో జేడి(యు) మాజీ నేతకు సంబంధాలున్నాయంటూ నక్వీ ఆరోపించారు.