: శివరామకృష్ణన్ కమిటీకి 6 వేల ప్రతిపాదనలు
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఎంపిక విషయానికి సంబంధించి కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీకి ఇప్పటిదాకా ఆరు వేల ప్రతిపాదనలు అందాయి. మంగళవారం నాటికి తమకు ఐదు వేల ప్రతిపాదనలు చేరాయని శివరామకృష్ణన్ అనంతపురంలో చెప్పిన సంగతి తెలిసిందే. బుధవారం చిత్తూరు జిల్లా తిరుపతిలో కమిటీ అధికారులు, ప్రజా ప్రతినిధులతో భేటీ నిర్వహించింది. భేటీ అనంతరం శివరామకృష్ణన్ మీడియాతో మాట్లాడారు. బుధవారం నాటికి తమకు 6 వేల ప్రతిపాదనలు అందాయని చెప్పిన ఆయన, త్వరలోనే కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నట్లు వెల్లడించారు. తమ నివేదిక రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలను ప్రతిబింబించేలా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.