: నేడు బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ
అమిత్ షాను బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించడం ఇక లాంఛనమే. ఈ క్రమంలో నేడు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కానుంది. ఈ భేటీలో అమిత్ షా నియామకానికి ఆమోదముద్ర పడనుందని సమాచారం. ప్రధానికి అత్యంత సన్నిహితుడైన అమిత్ షా మొన్నటి ఎన్నికల్లో తన వ్యూహచతురతను ప్రదర్శించి అందరినీ మెప్పించారు. ముఖ్యంగా ఉత్తరభారతదేశంలో బీజేపీకి తిరుగులేని విజయాలు లభించడంలో ఈయనది కీలకపాత్ర. యూపీలో ఏకంగా 71 స్థానాల్లో బీజేపీ విజయఢంకా మోగించడం అమిత్ షా చలవే.