: రైతులకు శుభవార్త!


వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు శుభవార్త! వాయవ్య బంగాళాఖాతంలో మరో రెండు రోజుల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో చెదురుమదురుగా వర్షాలు పడతాయని పేర్కొంది. ప్రస్తుతం ఛత్తీస్ గఢ్ నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వీటికితోడు నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతుండడంతో రానున్న రోజుల్లో మెరుగైన వర్షపాతం నమోదయ్యే అవకాశముంది.

  • Loading...

More Telugu News