: కర్నూలు జిల్లాలో ఒకే కుటుంబంలోని ముగ్గురి హత్య


పాత కక్షలతో ఒకే కుటుంబంలోని ముగ్గురిని ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలోని హలిగెరలో చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన బంగి మల్లయ్య, శ్రీనివాసులు, రామాంజనేయులు ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యారు. 2013లో జరిగిన నల్లన్న హత్యకు ప్రతీకారంగా ఈ దాడి జరిగింది. హత్యకు గురైన ముగ్గురూ జైలు నుంచి బెయిల్ పై బయటకు వచ్చినట్లు తెలిసింది.

  • Loading...

More Telugu News