: టీఆర్ఎస్ ఎంపీలు మా సహనాన్ని పరీక్షించొద్దు: టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ


టీఆర్ఎస్ ఎంపీలు ఆంధ్రపద్రేశ్ ప్రజల సహనాన్ని పరీక్షించడం సరికాదని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ హితవు పలికారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కేసీఆర్ సమర్ధించిన విషయం టీఆర్ఎస్ ఎంపీలు మర్చిపోవద్దని అన్నారు. యూపీఏ రాష్ట్ర విభజన బిల్లులో పొందుపరిచిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎన్డీయే ప్రతిపాదిస్తే, టీఆర్ఎస్ కు నొప్పులు ఎందుకు వస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. తాము ఉద్యమించే పరిస్థితి తేవద్దని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంతా గమనిస్తున్నారని, తమ సహనానికి కూడా ఓ హద్దు ఉందని, తెలంగాణ ప్రజలకు చెప్పినట్టు దేశానికి కూడా అబద్ధాలు చెప్పొద్దని ఆయన హెచ్చరించారు.

  • Loading...

More Telugu News