: విజయవాడ నుంచి న్యూఢిల్లీకి డైలీ ఏసీ ఎక్స్ ప్రెస్: దక్షిణ మధ్య రైల్వే జీఎం
రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చేకూరిన ప్రయోజనాల గురించి ఈ సమావేశంలో ఆయన వివరించారు. * 9 హైస్పీడ్ రైళ్లలో రాష్ట్రం మీదుగా రెండు వెళ్తాయి. నాగ్ పూర్ - సికింద్రాబాద్, చెన్నై-హైదరాబాద్ మధ్య హైస్పీడ్ రైళ్లు * సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీకి ప్రీమియం రైలు కేటాయించారు. * విజయవాడ నుంచి న్యూఢిల్లీకి ప్రతీరోజూ నడిచే ఏసీ ఎక్స్ ప్రెస్ * పెద్దపల్లి-నిజామాబాద్ మధ్య రైల్వే లైను త్వరలో పూర్తి * ఆధ్యాత్మిక క్షేత్రాలకు ప్రత్యేక రైళ్ల కోటాలో తిరుపతి ఉంటుంది. * దక్షిణ మధ్య రైల్వేలో సౌకర్యాలు మెరుగుపరుస్తామని చెప్పారు.