: మహారాష్ట్రకు తదుపరి సీఎం బీజేపీ-శివసేన కూటమి వ్యక్తే: ఉద్ధవ్ థాకరే
మహారాష్ట్ర అసెంబ్లీకి వచ్చే అక్టోబర్ లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎలాగైనా పాగా వేయాలని చూస్తోంది బీజేపీ-శివసేన కూటమి. ఈ క్రమంలో తాజాగా శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ, రాష్ట్రానికి తదుపరి ముఖ్యమంత్రి బీజేపీ-శివసేన కూటమి వ్యక్తే తప్పకుండా అవుతారని ధీమా వ్యక్తం చేశారు. తప్పకుండా పందర్ పూర్ లో వచ్చే ఏడాది సంప్రదాయ ఏకాదశి పూజ ఆ సీఎం చేతుల మీదుగానే జరుగుతుందన్నారు. పశ్చిమ రాష్ట్రాల్లో ప్రతి ఏడాది ఈ పూజను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రే నిర్వహిస్తారట.