: రైల్వే బడ్జెట్ పై ప్రముఖుల స్పందన


రైల్వే మంత్రి సదానంద గౌడ ఇవాళ లోక్ సభలో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ పై మిశ్రమ స్పందన వినవస్తోంది. అధికార పార్టీ నేతలు బడ్జెట్ బాగున్నదంటూ ప్రశంసల జల్లు కురిపిస్తే... ప్రతిపక్ష సభ్యులు మాత్రం విమర్శలు చేశారు. బడ్జెట్ సమర్పించడం ముగియగానే సభలో బీజేపీ సభ్యులు "మోడీ జిందాబాద్" అంటూ నినాదాలు చేశారు. ఈ రైల్వేబడ్జెట్ రైలు ప్రయాణాన్ని ఆనందమయం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బడ్జెట్ దేశంలోని పేదలకు అనుకూలంగా లేదని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఈ రైల్వే బడ్జెట్ అప్రధానమైన విషయాల పైన దృష్టి పెట్టిందని రైల్వే శాఖ మాజీ మంత్రి పి.కె.బన్సల్ అన్నారు. లోపాల గురించి బడ్జెట్ లో చెప్పారు కానీ, పరిష్కార మార్గాలు చూపలేదని మాజీ మంత్రి అశ్విన్ కుమార్ పెదవి విరిచారు.

  • Loading...

More Telugu News