: ఫిఫా వరల్డ్ కప్ లో బీరు విప్లవం
బ్రెజిల్ ఆతిథ్యమిస్తోన్న సాకర్ వరల్డ్ కప్ లో బీరు వరదలై ప్రవహిస్తోంది. స్టేడియంలోని కౌంటర్లలో బీర్లు కొనేందుకు అభిమానులు బారులు తీరుతున్నారు. టోర్నీ ఆరంభం నుంచి బీర్లు రికార్డు స్థాయిలో అమ్ముడవడం పట్ల ఫిఫా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో స్టేడియం వద్ద బీరు అమ్మకాల విషయంలో నిబంధనలు సవరించుకోవాల్సిందిగా బ్రెజిల్ కు విజ్ఞప్తి చేసింది కూడా. వాస్తవానికి అభిమానుల మధ్య హింసను నివారించడానికి 2003లో బ్రెజిల్ స్టేడియాల వద్ద మద్యం అమ్మకాలను నిషేధించింది. అయితే, ప్రపంచకప్ ను దృష్టిలో పెట్టుకుని ఆల్కహాల్ అమ్మకాలపై ఉన్న నిషేధాన్ని సడలించారు.