: లండన్ లో ఛారిటీ వేలం నిర్వహించనున్న యువరాజ్ సింగ్
భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ లండన్ లో ఓ ఛారిటీ వేలం కార్యక్రమం నిర్వహించనున్నాడు. క్యాన్సర్ పీడితుల సహాయార్థం నిధుల సేకరణే ఈ వేలం లక్ష్యం. జూలై 14న జరిగే ఈ వేలంలో అపురూపమైన క్రికెట్ వస్తువులు, పలుజ్ఞాపికలను వేలానికి ఉంచుతారు. లండన్ లోని పార్క లేన్ లో జరిగే ఈ కార్యక్రమానికి భారత బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్ మన్ కెవిన్ పీటర్సన్ హాజరవుతారు. సచిన్ 200వ టెస్టు సందర్భంగా ధరించిన టీషర్టు, 2011 వరల్డ్ కప్ సందర్భంగా యువీకి అందించిన పతకం ఈ వేలంలో ప్రదర్శనకు రానున్నాయి. ఇక, ఈ వేలంలో భారత టాప్ కమెడియన్ కపిల్ శర్మ షో ప్రధానాకర్షణగా నిలవనుంది.