: భారత్ లో పేదరికం ఎక్కువే: ఐరాస


భారత్ లో పేదరికం నేటికీ ఎక్కువగానే ఉందని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది. మిలీనియం డెవలప్ మెంట్ గోల్స్ పేరిట వివిధ అంశాల్లో ఆయా దేశాలు సాధించిన ప్రగతి, మరింత దృష్టి సారించాల్సిన అంశాలకు సంబంధించిన నివేదికను ఐరాస సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ సోమవారం విడుదల చేశారు. ఈ నివేదిక ప్రకారం భారత్ లో నేటికీ పేదరికం ప్రధాన సమస్యగానే ఉంది. అంతేకాక మాతాశిశు మరణాలు కూడా ఆందోళనకర స్థాయిలోనే ఉన్నాయి. పేదరికం విషయంలో భారత్ ఆశించిన స్థాయిలో పురోగతి సాధించడంలో విఫలమైంది. ఇప్పటికీ 10 కోట్లకు పైగా భారతీయులు అత్యంత దారిద్ర్యంలో బతుకులు వెళ్లదీస్తున్నారు. శిశు మరణాలు కూడా భారత్ లో భారీగానే నమోదవుతున్నాయి. నాలుగేళ్లు నిండకముందే చనిపోతున్న పిల్లల సంఖ్య 2012లో భారత్ లో 14 లక్షలుగా నమోదైంది. దక్షిణాసియా మాత్రం ఈ విషయంలో వేగవంతమైన వృద్ధి సాధిస్తోందని నివేదిక వెల్లడించింది. మాతృ మరణాల విషయంలో భారత్ తో పాటు నైజీరియా కూడా ఆందోళన కలిగించే స్థాయిలో ఉన్నట్లు నివేదిక గణాంకాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News