: 41వ ఏట గంగూలీ... వేడుకలకు దూరం!
టీమిండియాకు ప్రపంచ క్రికెట్ లో సమున్నత స్థానం కల్పించిన దిగ్గజ క్రికెటర్ సౌరవ్ గంగూలీ నిన్న 41వ పడిలో అడుగుపెట్టాడు. తమ అభిమాన క్రికెటర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు కోల్ కతాలోని బెహలా ప్రాంతంలోని గంగూలీ నివాసం ఎదుట అభిమానులు, స్కూలు పిల్లలు పెద్ద ఎత్తున గుమికూడారు. అయితే, సింగపూర్ నుంచి ఈ ఉదయమే కోల్ కతాకు తిరిగివచ్చాడు. తండ్రి చండీదాస్ ఈ ఏడాది ఫిబ్రవరిలో చనిపోగా, సౌరవ్ కుటుంబం ఇంకా ఆ విషాదం నుంచి తేరుకోలేదు. తమకు ఈ ఏడాది విషాదకరరీతిలో ఆరంభమైందని, అందుకే పుట్టినరోజును ఆస్వాదించలేకపోతున్నానని, వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని ఈ ప్రిన్స్ ఆఫ్ కోల్ కతా తెలిపాడు. అభిమానులకు తన జన్మదిన సందేశమిస్తూ... జీవితంలో ఏదో ఒకటి లక్ష్యంగా పెట్టుకుని సాధించాలని సూచించాడు.