: రైల్వే బడ్జెట్ నేడే
ఈ రోజు పార్లమెంటులో రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర రైల్వే మంత్రి సదానందగౌడ తొలిసారిగా బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. ఇప్పటికే ప్రయాణ ఛార్జీలను 14.2శాతం, సరకు రవాణా ఛార్జీలను 6 శాతం పెంచిన కేంద్ర ప్రభుత్వం... బడ్జెట్లో ఏం చేయబోతోందా? అనే ఆసక్తి సర్వత్ర నెలకొంది. ప్రయాణికుల ద్వారా వచ్చే ఆదాయం గణనీయంగా పడిపోయిన నేపథ్యంలో, రైల్వే మంత్రి విభిన్న రీతిలో బడ్జెట్ ను ప్రవేశపెడతారనే అంచనాలు ఉన్నాయి. కొత్త రైళ్లు, నూతన రైల్వే మార్గాల విషయంలో కూడా సదానంద వాస్తవిక దృక్పదంతో వ్యవహరించనున్నారు. లాభదాయకం కాని ప్రాజెక్టులను రద్దు చేయడానికి కేంద్రం ఏ మాత్రం వెనుకడుగు వేయదనే విషయం స్పష్టమవుతోంది.