: విద్యార్థి ప్రాణం బలిగొన్న క్రికెట్ మ్యాచ్


తమిళనాడులోని మధురై శివార్లలో క్రికెట్ మ్యాచ్ సందర్భంగా తలెత్తిన వివాదం ఓ విద్యార్థి ప్రాణాన్ని బలిగొంది. పెరుంకుడి ప్రాంతంలోని ఓ ప్రైవేటు కళాశాలలో బికాం ఫస్టియర్ చదువుతున్న సేతు సూర్య (18) అనే విద్యార్థి ఆదివారం సాయంత్రం ఇతర విద్యార్థులతో కలిసి క్రికెట్ ఆడుతుండగా వివాదం తలెత్తింది. అయితే, ఈ వివాదంలో బయటివ్యక్తులు జోక్యం చేసుకున్నారు. మ్యాచ్ ముగిసిన కొన్ని గంటల తర్వాత సేతు సూర్య పై ఏడుగురు వ్యక్తులు మారణాయుధాలతో దాడి చేశారు.
తీవ్రగాయాలైన ఈ విద్యార్థిని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ ఈ ఉదయం ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సేతు సూర్యపై దాడి చేసిన వారు విద్యార్థులు కారని, నిందితుల కోసం గాలింపు జరుపుతున్నామని తెలిపారు. కాగా, సేతు సూర్య స్వస్థలం రామేశ్వరం.

  • Loading...

More Telugu News