: అఫ్జల్ గురుకి ఈ ఉదయం ఉరిశిక్ష అమలు


2001 లో పార్లమెంటుపై దాడి చేసిన కేసులో మరణశిక్ష పడిన అఫ్జల్ గురుని ఈ ఉదయం 8.00 గంటలకు ఢిల్లీ లోని తీహార్ జైలులో ఉరితీశారు. కాశ్మీర్ లోని బారాముల్లాకు చెందిన అఫ్జల్ క్షమా భిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి తిరస్కరించిన నేపథ్యంలో మరణశిక్షను అమలు జరిపారు.

ముంబయ్ దాడుల కేసులో నేరస్తుడు కసబ్ ను రెండు నెలల క్రితం ఉరి తీసిన విధంగానే, అఫ్జల్ ను కూడా చడీ చప్పుడూ లేకుండా ఉరి తీశారు. ఈ నేపథ్యంలో గొడవలు చెలరేగవచ్చనే ఉద్దేశంతో, దేశమంతటా ముఖ్య నగరాలలో హై అలెర్ట్ ప్రకటించారు. కాశ్మీర్ లో కర్ఫ్యూ విధించారు. అఫ్జల్ ఉరికి సంబంధించి కేంద్ర హొమ్ శాఖ కాసేపట్లో ప్రకటన చేయచ్చు!  

  • Loading...

More Telugu News