: కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే: సోనియా


కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధరల పెరుగుదలపై కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ మాట్లాడుతూ... పార్లమెంటులో సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాంగ్రెస్సేనని స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీకి కావాల్సిన అన్ని అర్హతలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయని సోనియా చెప్పారు.

  • Loading...

More Telugu News