: షరియత్ కోర్టులకు చట్టబద్ధ హోదాపై సుప్రీం విముఖత
ముస్లిం షరియత్ కోర్టులకు చట్టబద్ధ హోదాపై సుప్రీంకోర్టు విముఖత తెలిపింది. ఈ మేరకు వారికి న్యాయం చెప్పే అధికారం లేదని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. వ్యక్తుల అనుమతి లేనిదే వారి హక్కులపై దారుల్ ఖజాలు తీర్పు ఇవ్వకూడదని కోర్టు పేర్కొంది. ఈ క్రమంలో అమాయకులపై షరియత్ కోర్టులు ఉత్తర్వులు జారీ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ కోర్టులు జారీ చేసే ఫత్వాలు ఎవరి స్వేచ్ఛకైనా భంగం కలిగిస్తే అవి అక్రమమైనవేనని స్పష్టం చేసింది. అమాయకులను శిక్షించమని ఏ మతం చెప్పడం లేదని, బాధితులు సంప్రదించినప్పుడు మాత్రమే షరియా కోర్టు ఆదేశాలివ్వాలని వెల్లడించింది.