: మున్సిపల్, జడ్పీ ఛైర్మన్ల అక్రమాలపై గవర్నర్ కు వైసీపీ ఫిర్యాదు


గవర్నర్ నరసింహన్ ను వైెఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యేలు కలిశారు. తాజాగా జరిగిన మున్సిపల్, జడ్పీ ఛైర్మన్ల పరోక్ష ఎన్నికల్లో అక్రమాలపై ఫిర్యాదు చేశారు. తమ పార్టీ బీ ఫారంతో గెలిచిన వారితో టీడీపీకి అనుకూలంగా ఓట్లేయించుకున్నారని చెప్పారు. మెజారిటీ లేకపోయినా ఇతర పార్టీల సభ్యులను ప్రలోభ పెట్టడంతో పాటు భయానక వాతారవణం సృష్టించి ఎన్నికలను వాయిదా వేయించారని గవర్నర్ కు వివరించినట్టు జగన్ మీడియాకు చెప్పారు. అంతేగాక వైఎస్సార్సీపీ సభ్యులందరినీ బయటకు పంపించి... టీడీపీ సభ్యులు జడ్పీ ఛైర్మన్లుగా ఎన్నికైనట్టు ప్రకటించడం వంటి అరాచకాలన్నింటినీ వివరించామని తెలిపారు. వాటికి సంబంధించిన దృశ్యాలను సీడీ రూపంలో గవర్నర్ కు అందించామన్నారు. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని కోరామన్నారు.

  • Loading...

More Telugu News