: పాప్ గాయని ఎదపై పెంపుడు కుక్క


ప్రముఖ పాప్ సింగర్ మిలీ సైరస్ ఎంతో ఇష్టపడి పెంచుకున్న ఫ్లాయిడ్ అనే కుక్క మరణించింది. దాని జ్ఞాపకాల నుంచి బయటపడని మిలీ సైరస్... దాని గుర్తు శాశ్వతంగా ఉండిపోయేలా తన ఎదపై వృత్తాకారంలో దాని టాటూ వేయించుకుంది. టాటూ వేసుకోవడం విశేషం కానప్పటికీ, టాటూతో ఫోటోలకి ఫోజులచ్చి ఇన్ స్టాగ్రామ్ లో పెట్టింది.
దీంతో అందరూ దానిపైనే చర్చించుకోవడం విశేషం. ఫ్లాయిడ్ అలాస్కన్ క్లీ జాతికి చెందిన కుక్క. కొయినో సైరస్ అనే మరో కుక్కను పెంచుకుంటున్నప్పటికీ ఫ్లాయిడ్ ను మరిపించలేకపోతోందని సైరస్ పేర్కొంది. తన స్నేహితుల సాయంతో టాటూ వేయించుకున్నానని సైరస్ తెలిపింది.

  • Loading...

More Telugu News