: ధరల పెంపుపై చర్చకు ప్రతిపక్షాల పట్టు... లోక్ సభలో రగడ
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మొదలైన తొలిరోజే లోక్ సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ముందుగా స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. కానీ, దేశంలో ధరల పెంపుపై చర్చ చేపట్టాలంటూ పలువురు ప్రతిపక్ష, విపక్ష సభ్యులు సభలో నినాదాలు చేస్తూ ప్రశ్నోత్తరాలను అడ్డుకుంటున్నారు. అటు పశ్చిమబెంగాల్ ఎంపీ తపస్ పాల్ 'అత్యాచార' అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ పార్లమెంటు ద్వారం వద్ద సీపీఐ నేతలు ధర్నా చేస్తున్నారు. ఆయనను పార్లమెంటు నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.