: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముందుగా రాజ్యసభ సభ్యురాలిగా సభలో నిర్మలా సీతారామన్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం కొత్తగా ఎన్నికైన పలువురు రాజ్యసభ సభ్యులు ప్రమాణం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో చోటుచేసుకున్న గెయిల్ పైప్ లైన్ లీకైన ఘటనలో మరణించిన వారికి లోక్ సభ సంతాపం వ్యక్తం చేసింది. అటు చెన్నై శివారులోని పదకొండు అంతస్థుల భవనం కూలిన ఘటనలో మృతులకు కూడా సభ నివాళులర్పించింది.