: ఇఫ్తార్ విందులో సల్మాన్, షారుక్ ఆలింగనం!
గతేడాదిలానే ఈ సంవవత్సరం కూడా బాలీవుడ్ నటులు షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ ప్రేమగా ఆలింగనం చేసుకున్నారు. ఇలా మరోసారి ప్రేక్షకాభిమానులను ఆనందోత్సాహాల్లో ముంచెత్తారు. ముంబయిలో బాబా సిద్ధికీ అనే రాజకీయ నేత ఇచ్చిన ఇఫ్తార్ విందులో వారిద్దరూ పాల్గొన్నప్పుడు ఈ అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా చిరునవ్వులతో ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్న ఖాన్ ద్వయం సదరు నేతతో కలసి ఫోటోలకు ఫోజులిచ్చినట్టు ఓ టీవీ ఫుటేజ్ చూపుతోంది. పోయిన ఏడాది సిద్ధికీ ఇచ్చిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న షారుక్, సల్మాన్ తొలిసారి ఆలింగనం చేసుకున్నారు. కొన్నేళ్ల కిందట కత్రినాకైఫ్ పుట్టినరోజు పార్టీకి హాజరయిన ఖాన్ లు ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దాంతో, అప్పటినుంచి ఎడమోహం పెడమోహంగా ఉంటూ వస్తున్నారు.