: ఐదు తీర్మానాలు చేసిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్


హైదరాబాదులోని ఇందిరాభవన్ లో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతల సమావేశం జరిగింది. ఈ భేటీకి ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, చిరంజీవి, కేవీపీ, ఆనం, బొత్స, కన్నా, కిళ్లి, పళ్లంరాజు తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించిన నేతలు... చివరకు ఐదు తీర్మానాలు చేశారు. అవేంటంటే...
* ఎన్డీయే ప్రభుత్వం విభజనకు సంబంధించిన చట్టాలను అమలు చేయాలి. * రాష్ట్రంలో వెంటనే రైతు రుణమాఫీ చేయాలి. * డ్వాక్రా రుణమాఫీ జరగాలి. * కొత్తగా పీసీసీ, డీసీసీ, మండల కమిటీలను ఏర్పాటు చేయాలి. * జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలి.

  • Loading...

More Telugu News