: యెమెన్ లో వర్గ పోరు... 35 మంది హతం
యెమెన్ మరోసారి రక్తమోడింది. షిటే హౌతీ రెబెల్స్ - ఇస్లామిస్ట్ గిరిజన వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో 35 మంది మృతి చెందారని యెమెన్ భద్రతాధికారులు వెల్లడించారు. మరణించిన వారిలో 15 మంది సైనికులు ఉండగా మిగిలిన 20 మంది రెబల్స్ అని తెలిపారు. గిరిజనులు, సైనికులు కలసి రెబెల్స్ తో పోరాడారు. ఈ ఘటనలో మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు.