: అహోబిలంలో ఉద్రిక్తత
కర్నూలు జిల్లాలోని అహోబిలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అహోబిలంలో అక్రమంగా నిర్మించిన పలు దుకాణాలను అధికారులు తొలగిస్తుండగా, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అక్కడికి చేరుకున్నారు. దుకాణాల తొలగింపును అడ్డుకున్నారు. దీంతో, టీడీపీ నేతలు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.