: ఈ బడ్జెట్ లో రూ. 5 వేల కోట్లు ఇచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి: టీఎస్సార్
నూతన ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం ఈ బడ్జెట్ లో రూ. 5 వేల కోట్లు ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు సుబ్బరామిరెడ్డి సూచించారు. ఆంధ్రప్రదేశ్ ఎంపీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన సమావేశానికి హాజరైన ఆయన ఈ సూచన చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ప్రతిపత్తి సాధించేందుకు తాము పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. 34 అంశాలతో కూడిన జాబితాను కేంద్రానికి పంపాలని సమావేశంలో నిర్ణయించినట్టు ఆయన తెలిపారు.