: ట్విట్టర్లో చేరనున్న మరో ఇద్దరు కేంద్ర మంత్రులు
కేంద్రం ప్రజలతో మమేకం అయ్యేందుకు ట్విట్టర్ పై విపరీతంగా ఆధాపడుతున్నట్టు కనిపిస్తోంది. సోషల్ మీడియాను విరివిగా ఉపయోగించుకోవాలంటూ ప్రధాని మోడీ తన క్యాబినెట్ కు పలు సందర్భాల్లో సూచించడం తెలిసిందే. ఈ క్రమంలో ఆర్థిక, వాణిజ్య మంత్రులు కూడా ట్విట్టర్ బాట పట్టనున్నారు. ఈ మేరకు ట్విట్టర్ ఇండియా (వార్తలు, రాజకీయాలు మరియు ప్రభుత్వం) అధిపతి రహీల్ ఖుర్షీద్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ భావవ్యక్తీకరణకు ట్విట్టర్ ఓ మాధ్యమంగా ఉపయోగపడడం హర్షణీయమని ఖుర్షీద్ పేర్కొన్నారు.