: మ్యూజిక్ డైరక్టర్ మణిశర్మపై చార్జిషీట్


టాలీవుడ్ మ్యూజిక్ డైరక్టర్ మణిశర్మపై చెన్నై పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. మణిశర్మకు చెన్నైలోని కానత్తూర్ వద్ద కొంత స్థలం ఉంది. అయితే, దానిపక్కనే ఉన్న 73 సెంట్ల స్థలాన్ని మణి ఆక్రమించాడని ఆ స్థల యజమాని సేలంకుప్పన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ కేసును క్రైమ్ బ్రాంచ్ కు బదలాయించారు. దీంతో, ప్రాథమిక విచారణ చేపట్టిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మణిశర్మపై ఆరోపణలు నిజమేనని తేల్చారు.
ఈ వ్యవహారంలో అరెస్ట్ వారెంట్ జారీ చేయగా, మణిశర్మ ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చార్జిషీట్ దాఖలు చేశారు.

  • Loading...

More Telugu News