: బడ్జెట్ సమావేశాల్లో వేడి పుట్టించనున్న ధరల పెంపు


కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన నెల రోజుల తర్వాత దేశ వ్యాప్తంగా అన్ని ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. తొలుత రైల్వే టికెట్ ఛార్జీల దగ్గర నుంచీ వంటగ్యాస్ వరకు ఒక్కొక్కటి ధరలు పెంచుకుంటూ పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 7నుంచి (సోమవారం) ఆగస్టు 14 వరకు జరగనున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మంట పుట్టించనున్నాయి. పెంచిన ధరలపై ప్రతిపక్షాలు బీజేపీని కడిగిపారేసేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నాయి.
ఈ మేరకు ఈ రోజు ఢిల్లీలో లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహజన్ ఆధ్వర్యంలో అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశం జరిగింది. ఇందులో సమావేశాల నిర్వహణపై చర్చించారు. ఏఏ అంశాలు చర్చకు రానున్నాయో కూడా మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో ఇరాక్ లో అంత్యర్యుద్ధం నేపథ్యంలో భారత్ పరిస్థితిపై ఇరు సభల్లోనూ ప్రభుత్వం తరపున మంత్రి సుష్మాస్వరాజ్ ఓ ప్రకటన చేయనున్నారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. సాధారణ బడ్జెట్, రైల్వే బడ్జెట్ ను ఈ సమావేశాల్లో ప్రవేశపెడుతున్నామని చెప్పారు. అంతేగాక జాతీయంగా ముఖ్యమైన పలు అంశాలపైనా సమావేశాల్లో చర్చించేందకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News