: ఇక ఆన్ లైన్ లో 'దబాంగ్-2' చూడొచ్చు!
'దబాంగ్'.. హీరో సల్మాన్ ఖాన్ సినిమా కెరీర్ లో 'ది బెస్ట్' చిత్రంగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో సల్మాన్ విభిన్నమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించి అభిమానులను, ప్రేక్షకులను అలరించాడు. దీనికి కొనసాగింపుగా వచ్చిందే 'దబాంగ్-2'. అంతర్జాతీయ స్థాయిలో సల్లూ అభిమానులను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడీ చిత్రాన్ని ఆన్ లైన్ లో చూసేందుకు వెసులు బాటును కల్పిస్తోంది ఈ చిత్రం హక్కుల్ని పొందిన ఈరోస్ సంస్థ. అయితే, దీనికి సంస్థ నిర్ణయించే ఫీజు చెల్లించాల్సి వుంటుంది. సల్మాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ దర్శకత్వం, నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం విడుదలైన తొలిరోజే రూ.21 కోట్ల కలెక్షన్లు రాబట్టి రికార్డు సృష్టించింది.