: శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజలు చేసిన మంత్రి కిశోర్ బాబు


చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కిశోర్ బాబు... రాహు కేతు పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు సింగపూర్ మంత్రి షణ్ముగం కూడా ఆలయానికి వచ్చి పరమశివుడిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దర్శనానంతరం మంత్రి కిశోర్ బాబు మీడియాతో మాట్లాడుతూ... సింగపూర్ తరహాలో సీమాంధ్రను అభివృద్ధి చేస్తామన్నారు. రైతు రుణమాఫీ సహా ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News