: అనంత జడ్పీ ఛైర్మన్ గా ఎన్నిక కానున్న పరిటాల ప్రధాన అనుచరుడు


పరిటాల రవి ప్రధాన అనుచరుడు చమన్ అనంతపురం జిల్లాపరిషత్ ఛైర్మన్ గా ఎన్నిక కానున్నారు. టీడీపీ నాయకత్వం కాసేపటి క్రితం చమన్ పేరును ఛైర్మన్ అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించింది. జిల్లాలో మొత్తం 63 జడ్పీటీసీ స్థానాలుండగా టీడీపీ 42 చోట్ల విజయం సాధించింది. వైకాపా 21 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. దీంతో, ఛైర్మన్ గా చమన్ ఎన్నిక లాంఛనం కానుంది. జిల్లాలోని రామగిరి నుంచి చమన్ జడ్పీటీసీగా గెలుపొందారు.

  • Loading...

More Telugu News