: నాకు అవంటేనే ఇష్టం...ఈ సినిమా ఈ ఏడాదికి బెస్ట్ సినిమా: వరుణ్ ధావన్
బాలీవుడ్ యువనటుడు వరుణ్ ధావన్ నటించింది రెండు సినిమాల్లోనే అయినా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అందులో ఒకటి తెలుగులో 'కందిరీగ' ('మై తేరా హీరో') సినిమా కావడం విశేషం. తాజాగా 'హంప్టీ శర్మాకీ దల్హన్' సినిమాలో నటించాడు. ఆ సినిమా ప్రమోషన్ లో మాట్లాడుతూ, తనకు చిలిపి పాత్రలంటే చాలా ఇష్టమని, తన ఇష్టానికి తగ్గట్టు అన్నీ అలాంటి పాత్రలే తనకు వస్తున్నాయని హర్షం వ్యక్తం చేశాడు.
తాజా సినిమా 'హంప్టీ శర్మాకీ దుల్హన్' లో చురుకైన రొమాంటిక్ హీరోగా నటించానని వరుణ్ తెలిపాడు. ఈ ఏడాది ఉత్తమ సినిమాగా 'హంప్టీ శర్మాకీ దుల్హన్' సినిమా నిలుస్తుందని ధీమాగా చెప్పాడీ కుర్రహీరో. ఈ సినిమాలో వరుణ్ ధావన్ తో అలియా భట్ జోడీ కట్టింది.