: ఏపీ స్థానిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కు చావుదెబ్బ... కిరణ్ పార్టీకి రెండు ఎంపీపీలు
ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కు చావుదెబ్బ తగిలింది. మొత్తం 652 ఎంపీపీల్లో ఒక్కటీ హస్తవశం కాలేదు. ఇక నిన్న జరిగిన 92 మున్సిపాలిటీల్లో కేవలం ఒక్కటే కాంగ్రెస్ గెల్చుకుంది. ఇదిలావుంటే, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ జై సమైక్యాంధ్ర చిత్తూరు జిల్లాలో రెండు ఎంపీపీలను దక్కించుకుంది. ఇక ఏపీలో టీడీపీ పదకొండు జిల్లాల్లో ఆధిక్యంలో నిలవగా, వైసీపీ కడప, నెల్లూరు జిల్లాలలో మాత్రమే ఆధిక్యంలో నిలిచింది.