: జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు
హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఇవాళ శాకంబరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చింది. ఇవాళ ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు ఈ నెల ఆరవ తేదీ వరకు జరగనున్నట్లు ఆలయ అధికారులు చెప్పారు. ఈ సందర్భంగా అమ్మవారిని కూరగాయలతో అలంకరించారు. వందలాది కిలోల కూరగాయలతో ఆలయాన్ని అలంకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సామూహిక లలితా సహస్ర నామ కుంకుమార్చనలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు. ఉత్సవాల్లో భాగంగా రాత్రి అమ్మవారికి పల్లకీ సేవ నిర్వహించనున్నారు.