: కొత్త గాళ్ ఫ్రెండ్ చాలా హాట్ అంటున్న షేన్ వార్న్


ఆస్ట్రేలియా లెగ్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ మరోసారి ప్రేమలో పడ్డాడు. మోడల్, బ్రిటీష్ నటి ఎలిజబెత్ హర్లేతో కటీఫ్ చెప్పిన తర్వాత ఇన్నాళ్ళకు తాను డేటింగ్ చేస్తున్నట్టు వార్న్ వెల్లడించాడు. ప్లేబోయ్ మోడల్ ఎమిలీ స్కాట్ తో ప్రేమాయణం మొదలెట్టానని, ఆమె చాలా హాట్ అని చెప్పాడు.
గత నెలలో స్కాట్ ను చుంబిస్తూ కెమెరా కంటికి చిక్కిన ఈ ఆస్ట్రేలియన్ రసికుడు ఎందుకొచ్చిన చిక్కనుకున్నాడో ఏమో, తమ రిలేషన్ ను బహిరంగంగా వెల్లడించాడు. వీరిద్దరూ ఇటీవలి వరకు ప్యారిస్ లో ఉండొచ్చారట. ఈ బంధం ఎంతకాలమో చూడాలి! అన్నట్టు, పిల్లల తండ్రి అయిన వార్న్ భార్యకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News