: త్వరలో భారత్ పర్యటనకు శ్రీలంక విదేశాంగ మంత్రి


శ్రీలంక విదేశాంగ మంత్రి జీఎల్ పెయిరిస్ వచ్చే వారంలో భారత్ లో పర్యటించే అవకాశాలున్నాయి. ఈ సందర్భంగా భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ తో ఆయన భేటీ కానున్నారు. ఇరు దేశాల మధ్య ప్రధాన అంశాలైన లంకలో తమిళుల సంక్షేమం, మత్స్యకారుల సమస్యలపై చర్చించే అవకాశం ఉందని సమాచారం. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి మాట్లాడుతూ, ఈ పర్యటన నేపథ్యంలో భారత్, లంక కలసి పని చేయాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఈ నెలలోనే ఆయన పర్యటన ఉండవచ్చని చెప్పారు.

  • Loading...

More Telugu News