: అత్యాచారాల్లో టాప్ 4 ఈ రాష్ట్రాలే


భారతదేశ ప్రతిష్ఠను మసకబారుస్తున్న అత్యాచారాలపై కేంద్ర ప్రభుత్వ లెక్కలు ఇలా ఉన్నాయి. గతేడాది దేశం మొత్తం మీద 33,707 అత్యాచారాలు జరుగగా, వాటిలో అత్యధిక అత్యాచారాలు 4,335 ఒక్క మధ్యప్రదేశ్ లోనే జరిగాయి. ద్వితీయ స్థానంలో రాజస్థాన్ నిలిచి 3,285 మంది అమ్మాయిల మానప్రాణాలతో ఆడుకుంది. 3063 రేపులతో మహారాష్ట్ర తృతీయ స్థానంలో నిలిచింది. అరాచకాల ఉత్తరప్రదేశ్ 3,050 మానభంగాలతో నాలుగో స్థానం ఆక్రమించిందని జాతీయ నేర గణాంకాల నివేదిక వెల్లడించింది.
2012 లోనూ అత్యాచారాలలో ఈ నాలుగు రాష్ట్రాలే టాప్ 4 గా నిలవడం విశేషం. అయితే దేశవ్యాప్తంగా 51,881 కిడ్నాప్ కేసులు నమోదవ్వగా, 8083 వరకట్న మరణాలు సంభవించాయి. ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే 9737 అపహరణ కేసులు నమోదవ్వగా, 2,335 మంది మహిళలు వరకట్నదాహానికి బలయ్యారు.
భర్త లేదా బంధువులు పెట్టే హింసలో పశ్చిమబెంగాల్ తొలి స్థానం ఆక్రమించింది, అక్కడ 18,116 హింస కేసులు నమోదవ్వగా, రాజస్థాన్ లో 15,094 హింస కేసులు నమోదై ద్వితీయ స్థానంలో నిలిచింది. 15,084 హింస కేసులు నమోదై ఆంధ్రప్రదేశ్ తృతీయ స్థానంలో నిలిచింది.

  • Loading...

More Telugu News