: జమ్మూ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: ప్రధాని మోడీ


జమ్మూకాశ్మీర్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ జమ్మూ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. జమ్మూకాశ్మీర్ లో రైలు సదుపాయాలు మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. కాగా, తాను ప్రారంభించిన కత్రా-ఉధంపూర్ రైలు ఎక్స్ ప్రెస్ కు 'స్త్రీ శక్తి' ఎక్స్ ప్రెస్ గా పేరు పెట్టాలని ఆయన పేర్కొన్నారు. అంతేగాక భారతీయ రైల్వేలో ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తామని చెప్పారు. ప్రైవేటు సంస్థల పెట్టుబడిపై త్వరలోనే రైల్వే అధికారులతో కలసి సమగ్రంగా చర్చిస్తామన్నారు. దాంతో, త్వరలోనే రైల్వే వ్యవస్థలో మార్పును చూస్తారన్నారు. కాగా, సరైన సౌకర్యాలతో కూడిన ఆధునిక రైల్వే స్టేషన్లను దేశ ప్రజలు చూస్తారని ఆయన హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News