: మోడీ చేతుల మీదుగా కత్రా-ఉధంపూర్ రైలు సర్వీసు ప్రారంభం


జమ్మూకాశ్మీర్ లోని కత్రా - ఉధంపూర్ రైల్వే సర్వీసును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు ప్రారంభించారు. జమ్మూకాశ్మీర్ లోని ట్రికుట కొండల్లో ఉన్న రైల్వేస్టేషన్ కు రైల్వే మంత్రి సదానంద గౌడ, ఆ రాష్ట్ర సీఎం ఒమర్ అబ్దుల్లాతో కలసి రైలుకు ప్రధాని పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సర్వీసుతో వైష్ణోదేవి ఆలయానికి రైలు సదుపాయం అందుబాటులోకి వచ్చింది. కాగా, ప్రతి ఏటా కోటిన్నర మంది భక్తులు వైష్ణోదేవి ఆలయాన్ని దర్శించుకుంటున్నారు. ప్రస్తుతం జమ్మూకాశ్మీర్ లో మోడీ పర్యటిస్తున్నారు. మోడీ పర్యటన నేపథ్యంలో, భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News