: మండల పరిషత్తులకు పరోక్ష ఎన్నికలు నేడే


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని మండల పరిషత్తులకు నేడు పరోక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో-ఆప్షన్ సభ్యులను ఎన్నుకోనున్నారు. ఈ ఉదయం 10 గంటలకు కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటలకు మండల పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నిక జరుగుతుంది. ఏపీలో మొత్తం 652, తెలంగాణలో మొత్తం 440 మండల పరిషత్తులకు ఎన్నికలు జరిగాయి. అయితే, మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల పరిషత్ కు కోర్టు స్టే కారణంగా ఈ రోజు పరోక్ష ఎన్నిక జరగడంలేదు. అలాగే, ఖమ్మం జిల్లాలోని 44 పరిషత్తులకు కూడా పరోక్ష ఎన్నికలు జరగడం లేదు.

  • Loading...

More Telugu News